ఏజెన్సీ ప్రాంతంలో మరో గిరిజన ప్రదర్శన శాలను అందుబాటులోకి తీసుకొని రావడానికి ప్రయ త్నాలు జరుగుతున్నాయి. బ్రిటీషు వారికి వ్యతిరేకంగా గిరిజనులు చేసిన విరోచిత పోరాటంతో పాటు వారి జీవన శైలి ఉట్టేపడే విధంగా దీనిని రూపుదిద్దనున్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు గిరిజన మ్యూజియాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం పేరుతో ప్రత్యేకంగా దీనిని నిర్మించనున్నారు. స్వాతంత్య్ర పోరా టంలో అసువులు బాసిన గంటం దొర, మల్లు దొర వంటి గిరిజన స్వతంత్య్ర సమరయోధుల విగ్రహాలను ఇందులో నెలకొల్పనున్నారు. విశాఖపట్నం జిల్లా పాడేరు ఐటిడిఎ పరిధిలోని కె.డి.పేటలో ఈ ప్రదర్శన శాలను ఏర్పాటు చేయాలని ఆలోచనలు చేస్తున్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంతంలోనే బ్రిటీషు వారి దురాగతానికి బలయ్యాడు. ఈ స్మ ృతి చిహ్నంగా కేడి పేటలో ఫ్రీడం ఫైటర్స్ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సుమారు 35 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
దాదాపు రూ. 13.36 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్నారు. హోలోగ్రాఫిక్ షో కోసం ప్రత్యేకంగా మరో రూమ్‌ను నిర్మించనున్నారు. దీంతో పాటుగా 300 మంది వీక్షించే విధంగా ప్రత్యేక థియేటర్ (ఆంఫిథియేటర్)ను ఏర్పాటు చేయనున్నారు. గిరిజనుల జీవన విధానం, నాటి బ్రిటీషు వాళ్ల దురాగతాలు, ప్రస్తుతం గిరిజను లకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన అంశా లను దృశ్యాల రూపంలో ఏర్పాటు చేయనున్నారు.