స్మార్ట్ విశాఖలో మోసగాళ్ళ చిట్టా వేళ్లూనుకుంటోంది...ఉదయం చదివే ప్రతీ పేపర్ లోను ఓ మోసగాడి వార్త కనిపిస్తూనే ఉంది. ఆర్ధిక అవసరాు పెరుగుతున్నాయో, అత్యాశ పేరుకుపోతోందో తెలీదు గాని సందు దొరికితే చాు ఏదో ఒక రూపంలో టోపి వేసే కేటుగాళ్ళు విజృంభించేస్తున్నారు...ఉద్యోగా పేరుతో కోటిన్నరకు పైగా టోకరా వేసే మహామహున్న ఈరోజుల్లో భూవివాదా విషయంలో క్షు డిమాండ్ చేయటం తప్పేమి కాదుకాకపోతే ఈసారి టోకరా వేసింది గెజిటెడ్ హోదాలోనే... తానో ఐఏఎస్ నంటూ భూమి సమస్యను పరిష్కరించేందుకు 2.5 క్షు కావాంటూ డిమాండ్ చేశారు. ఇంతకీ ఈ నకిలీ ఐఏఎస్ భగోలేంటో వివరాల్లోకి వెళ్ళి తొసుకుందాం..
విశాఖలో వెలుగు చూసిన ...
నకిలీ నయా మోసం
` స్మార్ట్‌గా సాగుతున్న ఆర్ధిక మోసాు
`తానో ఐఏఎస్ నంటూ ఎంట్రీ
`సమస్య ఏదయినా ఇట్టే పరిష్కరిస్తా
`క్షు కొట్టు కోట్ల మివైన భూమిని పట్టు
`ఇది మోసగాళ్ళ నయా మెనూ...
విశాఖపట్నం, వాయిస్‌టుడే:
మహానగరంలో మాయాగాళ్ళు పెచ్చుమీరిపోతున్నారు. ఉద్యోగాలిప్పిస్తాం క్షు కట్టండి అని కొందరు, విదేశాు పంపిస్తాం వీసాలిస్తాం అంటూ మరి కొందరు. ఇప్పటి వరకు ఇటువంటి మోసాను చూసిన విశాఖ వాసు సరికొత్త నకిలీ మోసాన్ని చూస్తున్నారు.. ఈసారి ఇంకాస్త పెద్ద హోదాతో హుందాగా క్షు లెక్కెడెదాం అనుకున్నాడు ఈ కేడి. ఐతే అవగాహన ఉండడం వన కలిగిన లాభమో, అవసరమేముందనే అనుమానమో తెలీదు గాని బాధితుడు సత్వరమే మేల్కొన్నాడు..క్షలిచ్చి బోదిబో మనకుండా ముందుగానే పోలీసుకు సమాచారిన్నిచ్చి కేటుగాడి ఖాతా ను ముగించేశాడు..
ఇదో రకం మోసం:
విశాఖలో నకిలీ ఐఏఎస్‌ను పోలీసు అరెస్ట్ చేశారు. భూమి సమస్య పరిష్కరిస్తానంటూ ఓ వ్యక్తికి వ వేశాడు. నకిలీ ఐఏఎస్ అధికారి వ్యక్తి నుంచి రూ. 2.5 క్షు తీసుకున్నాడు. బాధితునికి అనుమానం రావడంతో పోలీసుకు పిర్యాదు చేశాడు. బాధితుని పిర్యాదు మేరకు అతన్ని పోలీసు అరెస్ట్ చేశారు. నకిలీ ఐఏఎస్ అనిల్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన వ్యక్తిగా పోలీసు గుర్తించారు.
ఉద్యోగా కోసం కోట్లకు పాగా:
విశాఖలో ఈ తరహా మోసాు కొత్త కావచ్చు గాని, ఆర్ధిక నేరాు కొత్త మాత్రం కాదు...గత వారమే స్పందనలో ఇలాంటి సంఘటనే మెగులోకి వచ్చింది..ఆంధ్రాయూనివర్శిటిలో తానో అసిస్టెంట్ ప్రొఫెసర్ నంటూ ఉద్యోగాలిప్పిస్తానంటే రాజమౌళి తరహాలో ఓ చిన్న సెట్టు కూడా వేసి, కోట్లు వెనకేసుకున్న విషయం మరువక ముందే ఇలాంటి సంఘటన చోటుచేసేకోవడం మరింత శోచనీయం.
నిఘా పెంచాల్సి ఉంది:
ఇలాంటి నేరాు విశాఖలో విరివిగా జరుగుతున్నాయి. అయితే జరిగాక బాధపడటం కంటే జరగకుండా కాపు కాయడమే మేు కదా. అలా అని గడపగడపకు భద్రతను ఇవ్వడం జరగని పని. అందుకే ఖచ్చితంగా స్థానికుకు అధికారులెవరూ, ఎవరి చేతిలో ఏం పనుంటాయి వంటి అంశాుపై అవగాహన కలిగి ఉండటం మంచిది. ఆదిశగా యంత్రాంగం కృషి చేస్తే బాగుంటుందని కొందరి అభిప్రాయం. అదే కాకుండా , రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అవినీతి రహిత పానను అందిస్తానని చెబుతుంటే మనం మాత్రం ఇలా వెనుక దారిలో అడ్డగోు పనును ప్రోత్సహించటం ఎంతవరకు న్యాయమో ప్రజలే ఆలోచించాలి...
సమస్యకు మూలం ఇదే:
మోసాకు మూం నమ్మకం అనుకుంటాం. కాని మోసాకు మూం మనలోని అత్యాశ, బధ్ధకం, అవగాహనా లేమి మాత్రమే.. నిజాయితీ గా అన్ని అర్హతు ఉంటే ఉద్యోగం, వీసా, లోను సకం మీ దగ్గరకే వస్తాయి. కేవం మీరు చేయాల్సింది వాటిని సాధించేందుకు ప్రయత్నం మాత్రమే. కాని మనం మాత్రం అర్హత లేకుండానే అన్ని ఆశిస్తాం. వాటిని పొందడానికి ంచం ఎర వేస్తాం... అందుకే తప్పు తీసుకునే వాడిది కాదు, ఇచేచ్చ వారిదే... ఈ న్యాయాన్ని ఏ కోర్టు అము చేసినా అధికారు కన్నా ముందు , మోసగాళ్ళ కన్నా కఠినంగా మోసపోయిన వారు అంటే సామాన్య జనమే జైళ్ళలో కూర్చోవాలి... అందుకే లం చం ఇవ్వకుండా మీ హక్కును కాపాడుకుంటూ, బద్రతను పదిలపరుచుకోండి. పరుచుకోండి....